Home / MOVIES / రాహుల్‌ నాకు..తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటా..పునర్నవి సంచలన వాఖ్యలు..

రాహుల్‌ నాకు..తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటా..పునర్నవి సంచలన వాఖ్యలు..

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకొచ్చిన పునర్నవి శనివారం ఓ మీడియాతో తో మాట్లాడింది. రెండున్నర నెలలపాటు నా కుటుంబాన్ని, స్నేహితుల్ని బాగా మిస్సయ్యా. వచ్చేశావా అంటూ ఆనందంగా అంతా ఆలింగనం చేసుకున్నారు. నువ్వుండాల్సిన స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌వని అన్నారు. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఉండదేమోనని అనుకుంటున్నాను. ఉంటే మాత్రం ఆనందంగా వెళ్తానంది పునర్నవి . అలాగే బిగ్‌బాస్‌– 3 టాప్‌– 5లో రాహుల్‌తో పాటు వరుణ్, శ్రీముఖి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు హౌస్‌లో ప్రవర్తించిన తీరు, వారి హావభావాలు, కదలికల్ని దగ్గర్నుంచి చూశానంది. ఇక తన గురించి చెబుతూ..నేను తెనాలిలో పుట్టి పెరిగాను. హైదరాబాద్‌లో చదువు పూర్తి చేశాను. విల్లామేరీ కాలేజీలో సైకాలజీ, జర్నలిజం చేశా. చదువులో ఉండగానే ‘ఉయ్యాల..జంపాల’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి నా సినిమా జర్నీ మొదలైంది. అమెరికాలో మా అక్క వద్ద ఉన్నప్పుడే బిగ్‌బాస్‌ సీజన్‌– 2లో అవకాశం వచ్చినా కుదరలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్‌– 3లో అవకాశం వచ్చింది. ఇప్పుడు నా దృష్టంతా చదువు, సినిమాలపైనే. పెళ్లి ఆలోచన లేదు. ఒకవేళ నాకు నచ్చిన వ్యక్తి దొరికితే తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి వారిని ఒప్పించి చేసుకుంటా. వారు వద్దంటే ఊరుకుంటా. వారు చూసిన సంబంధం కూడా ఇష్టమే అన్నది. ఇకపోతే రాహుల్‌ నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరిది స్నేహం నేను రాహుల్‌తో ప్రేమలో ఉన్నానని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. మా గురించి బయట వేరేలా మాట్లాడుకోవడం చూసి చాలా బాధేసిందని చెప్పింది

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat