అక్టోబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేసిన పథకాలు గ్రామ ఉద్యోగాలపై మరోసారి సమీక్షించనున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ఇవ్వనున్న ఆరోగ్యశ్రీ కార్డులో విధివిధానాలను చర్చించనున్నారు. జూనియర్లకు ఇస్తున్న గౌరవ వేతనం, ఆటో ఓనర్ కు ఇస్తున్న గౌరవ వేతనం బడ్జెట్పై చర్చించనున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం నుంచి నిధులు వచ్చిన పెద్ద ఎత్తున పథకాలకు నిధులు కేటాయించింది లేదు. ఈ విషయంపై కూడా కేబినెట్లో చర్చించి కేంద్రం నుంచి ఎలా నిధులు తీసుకురావాలని జగన్ మోహన్ రెడ్డి సమీక్షించనున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు అవసరమైన వేల కోట్ల నిధులతో పాటు ఉద్యోగ ఉపాధి ఆదాయం సృష్టించడం ప్రధానంశంగా చర్చ జరగనుంది.