ఈ మధ్య సినిమాల కంటే వెబ్ సిరీస్ ల మీదే ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. అటు సినీ దర్శకులు, నటీనటులు సైతం వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెడుతున్నారు. హిందీలో హిట్ అయిన ఒరిజినల్స్ లో లస్ట్ స్టోరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలిసిందే. నాలుగు భిన్న నేపధ్యాల కథను ఇందులో డీల్ చేసిన విధానం అదిరిపోతుంది. ఈ ఒరిజినల్స్ లో నాలుగు భిన్న నేపధ్యాలను నలుగురు అగ్ర దర్శకులు తెరకెక్కించిన సంగతి తెల్సిందే. ఇప్పుడు ఈ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ ‘లస్ట్ స్టోరీస్‘ కు తెలుగు వెర్షన్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ఈ ఒరిజినల్ ను నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, సందీప్ రెడ్డి తెరకెక్కిస్తారు. రోనీ స్క్రవాలా ఈ ఒరిజినల్ ను నిర్మిస్తారు.
నందిని రెడ్డి తెరకెక్కించే సెగ్మెంట్ లో బోల్డ్ బ్యూటీ అమలా పాల్ నటిస్తుంది. హిందీ వెర్షన్ లో ఈ రోల్ ను కియారా అద్వానీ అత్యంత బోల్డ్ గా నటించి అందరి దృష్టిలో పడింది. ఈ సెగ్మెంట్ లో స్వయంతృప్తి పొందే ఒక సీన్ పై జనాల్లో విపరీతమైన చర్చ కూడా జరిగింది. మరి తెలుగు వెర్షన్ లో కూడా ఆ బోల్డ్ నెస్ ను అలాగే ఉంచుతారా లేక కొంచెం తగ్గిస్తారా అనేది చూడాలి