నెల్లూరు నగరంలో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు చేధించారు. నగరంలోని బాలాజీ నగర్లోని ఓ అపార్ట్మెంట్ లో దాసరి శాంతమ్మ అనే మహిళా గత కొంతకాలంగా గుట్టు చప్పుడు కాకుండా ఓ అపార్ట్మెంట్ లో వ్యభిచారం నిర్వహిస్తోంది. గతంలో ఒక్కతే వ్యభిచారం చేసిన శాంతమ్మ.. ఆ తరువాత కొంతమంది యువతులను తీసుకొచ్చి అపార్ట్మెంట్ లో ఉంచి వ్యభిచారం నిర్వహిస్తోంది. నిత్యం ఆ ఇంటికి ఎవరో ఒకరు వాస్తు పోతుండటంతో.. చుట్టుపక్కల ఉండే వాళ్లకు అనుమానం వచ్చింది. దీంతో పక్కన ఉండే వ్యక్తులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు అదును చూసి ఆ ఇంటిపై రైడ్ చేశారు. ఇద్దరు యువతులు, ఒక విటుడిని పట్టుకున్నారు. వ్యభిచార గృహం నడుపుతున్న దాసరి శాంతమ్మను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. యువతులను ప్రభుత్వ గృహాలకు తరలించారు. ఇక పోలీసుల ఇంటరాగేషన్ లో అనేక విషయాలు బయటపడ్డాయి. యువతులకు నెలజీతాలు ఇస్తూ వ్యభిచారం చేయిస్తోందని యువతులు పేర్కొన్నారు.