తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నేషనల్ డిజైన్ సెంటర్ కు వేదికగా కానున్నది అని మంత్రి కేటీ రామారావు తెలిపారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లోనే తొలిసారిగా ఈ తరహా సెంటర్ ఏర్పాటు కానున్నది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన డీపీఐఐటీతో కలిసి పనిచేస్తున్నాం. ఎన్డీసీ ఏర్పాటుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్నారు. హెచ్ఐసీసీలో నిన్న శనివారం జరిగిన వరల్డ్ డిజైన్ అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు పాల్గొన్నారు. 2020 నాటికి డిజైన్ పరిశ్రమ నుంచి రూ.19 వేల కోట్ల ఆదాయం రానున్నది అని ఆయన అన్నారు.