టీఆర్ఎస్ తోనే హుజుర్ నగర్,నేరేడుచర్ల అభివృద్ది సాద్యమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ అన్నారు.
26,29 బూత్ ల లోని గ్రందాలయ వీది,పూల బజార్,బాషా బజార్,మున్సిపల్ ఆఫీస్ రోడ్,మార్కెట్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డికి ఓటు వేయవలసిందిగా అభ్యర్దించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా హుజుర్ నగర్ అభివృద్ది చేసుకుందామన్నారు.నేరేడుచర్ల మున్సిపాలిటీ చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారని,అభివృద్ది కోసం 10కోట్ల నిదులు కేటాయించారన్నారు.ఎక్కడా లేని విదంగా తెలంగాణాలో సంక్షేమాభివృద్ది పథకాలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించారని,దేశానికే తెలంగాణాను ఆదర్శంగా నిలిపారన్నారు..
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ని సార్లు గెలిచినా ప్రజలకు చేసిందేం లేదని,కనీసం ప్రజలకు అందుబాటులో ఉండడన్నారు.సైదిరెడ్డి మీమద్యే ఉంటాడని అతన్ని గెలిపించుకుని నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు,బూత్ లెవల్ నాయకులు,కార్యకర్తలు,మహిళలు పాల్గొన్నారు.