ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు వెయ్యి రూపాయలు,ఐదు వందల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో సరికొత్త రూ.2000,500నోట్లు తీసుకొచ్చిన సంగతి విదితమే.
అయితే తాజాగా రూ.2వేల నోట్లను రద్దు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి ఒకటో తారీఖులోపు రద్దు అవుతుంది.అప్పటిలోగా మీ దగ్గర ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ వార్తలపై ఆర్బీఐ క్లారీటీ ఇచ్చింది. రూ.2వేల నోట్లు రద్దు అవబోతున్నాయని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అలాంటి నిర్ణయం ఏమి తీసుకోలేదు.. తీసుకోము అని ఆర్బీఐ తేల్చి చెప్పింది.