తెలంగాణ రాష్ట్రంలో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తుంది. ఇందులో భాగంగా ప్రస్తుత నీటి నిల్వ మొత్తం ఎనబై టీఎంసీలకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ 1091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 1088 అడుగులు ఉంది.
ప్రాజెక్టు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90.31 అడుగులు అయితే ఎగువ నుంచి పద్నాలుగు వేల క్యూసెక్కులకు పైగా ప్రవాహాం వస్తుంది. ఇక శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు స్వల్పంగా నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు పులిచింతల నుంచి ఎనబై రెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.