రబీ సీజన్లో రైతులకు మేలు కలిగించేలా ఇఫ్కో ఎరువుల ధరను తగ్గించింది. అందులో భాగంగా యూరియా ఎరువును కాకుండా ఇతర ఎరువుల చిల్లర ధరలను బస్తాకు రూ.25 నుంచి రూ.50 వరకు తగ్గించినట్లు ఇఫ్కో మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. దీంతో యాబై కిలోల డీఏపీ బస్తా ధర రూ.1250 నుంచి రూ.1200 లకు తగ్గింది. ఇతర కాంప్లెక్స్ ఎరువుల ధరలపై రూ.25 తగ్గింది. ఎన్పీకే-1 ధర రూ.1175,ఎన్పీకే-2 ధర రూ.1185, వేపపూత రూ.266.50గా ఉంది. ఈ ధరలు జీఎస్టీతో కలిపి ఉంటాయి.
