ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘనవిజయం సాధించింది. గత ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి చివరికి నట్టేటిలో ముంచేసింది. దానికి బదులుగా జగన్ ని గెలిపించి బాబుకు సరైన బుద్ధి చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబుకి ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయిన ఇచ్చిన హామీల మేరకు ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టాడు. అయితే ఇందులో కూడా బాబు ఏదోక తప్పు వెతకడం పనిలోనే ఉన్నాడు. ప్రస్తుతం ఇప్పుడు కంటి వెలుగుపై పడ్డాడు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “అబద్ధాలకూ ఒక హద్దుండాలి. చంద్రబాబు గారి పాలనలో 67 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి అంధత్వాన్ని పారదోలారట. మళ్లీ పరీక్షలెందుకంటూ ప్రశ్నిస్తున్నాడు. రికార్డుల్లో దొంగ రాతలు రాసుకుని 200-300 కోట్లు దిగమింగినట్టు ఆయనే బయట పెట్టుకుంటున్నాడని అన్నాడు.
అబద్ధాలకూ ఒక హద్దుండాలి. @ncbn గారి పాలనలో 67 లక్షల మందికి కంటి పరీక్షలు చేసి అంధత్వాన్ని పారదోలారట. మళ్లీ పరీక్షలెందుకంటూ ప్రశ్నిస్తున్నాడు. రికార్డుల్లో దొంగ రాతలు రాసుకుని 200-300 కోట్లు దిగమింగినట్టు ఆయనే బయట పెట్టుకుంటున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 11, 2019