గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏం చేసాడు అనే విషయానికి వస్తే ఎవరిదగ్గరా జవాబు ఉండదు. ప్రజలను మోసం చేసి తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రమాణస్వీకారం నాడు దొంగ సంతకాలు పెట్టి అనంతరం అందరికి చుక్కలు చూపించాడు. అలాంటి వ్యక్తి గ్రామా సచివాలయ వ్యవస్థ నేనే తెచ్చాను అనడం సరికాదని బొత్సా మండిపడ్డాడు. మహాత్ముడు స్ఫూర్తితో జగన్ ముందుకు వెళ్తున్నాడని, ప్రతీ పథకం ప్రజల గుమ్మం ముందుకు చేరవెయ్యలనేది ఆయన ముఖ్య ఉద్దేశ్యమని అందుకే ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని అన్నారు. టీడీపీ ఉన్నంతకాలం వైజాగ్ లో భూ కుంభకోణం భారీగా జరిగిందని..దీనికి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని ఆయన అన్నారు. చంద్రబాబు అండ్ కో మొత్తం దోచుకున్నారని మండిపడ్డారు.