పూణే వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు ఆట ప్రారంభమయ్యింది. 35/3 పరుగులు వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు భారత పేసర్లు ధాటికి తట్టుకోలేకపోయాడు. దాంతో ప్రారంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఉమేష్, షమీల దెబ్బకు ఆదిలోనే భయపడ్డారు. మొదటి టెస్ట్ లో స్పిన్నర్స్ రెచ్చిపోతే ఈ టెస్ట్ లో పేసర్లు చూసుకుంటున్నారు. అటు బ్యాట్టింగ్, ఇటు బౌలర్స్ అన్నీ కోణాల్లో భారత్ సౌతాఫ్రికా పై విరుచుకుపడుతుంది. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 67/5, కాగా కెప్టెన్ డుప్లేస్సిస్ 15రన్స్, డీకాక్ 5రన్స్ తో ఆడుతున్నారు.