తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీదే అధికారం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ఎన్నో హామీలను కురిపించిన టీఆర్ఎస్ తీరా అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసింది అని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు అన్నారు.
తెలంగాణ బీజేపీలో ఎలాంటి గ్రూపుల్లేవు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత బలమైన ప్రతిపక్షంగా బీజేపీ మారుతుంది. పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయిలో నేతలు,కార్యకర్తలు బాగా కృషి చేస్తుంది. ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.