తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కేంద్రం ఇచ్చే కాయకల్ప అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులల్లో సౌకర్యాలు,పారిశుధ్యం,వ్యర్థాల నిర్వహణ,ఇన్ ఫెక్షన్ నివారణ,తదితర లాంటి పలు అంశాల ప్రాతిపదికన రాష్ట్రం నుంచి నాలుగు ఆసుపత్రులు కాయకల్ప అవార్డులకు ఎంపికయ్యాయి.
జిల్లా ఆసుపత్రుల విభాగంలో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి మొదటిస్థానం దక్కింది. సంగారెడ్డి ,కొండాపూర్ జిల్లా ఆసుపత్రులు ద్వితీయ స్థానంలో నిలిచాయి. పీహెచ్సీ-సీహెచ్ సీ విభాగంలో పాల్వంచ ఆరోగ్య కేంద్రానికి ప్రథమ స్థానం దక్కింది.