తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై శివాజినగర్ కు చెందిన యూత్ సుమారు 100 మంది అమరారపు వెంకన్న ఆద్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ లో చేరారు.ఈ మేరకు వారికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు చేపడుతుందని,యువత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లోకి చేరటాన్ని స్వాగతిస్తున్నామన్నారు.ఉత్తమ్ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని అతను ప్రజలకు చేసిందేం లేదన్నారు.సైదిరెడ్డిని బారి మెజారిటీతో గెలిపించుకుని ముఖ్యమంత్రి గారికి బహుమానంగా ఇద్దామన్నారు.
టీఆర్ఎస్ లో చేరిన వారిలో అమరారపు కార్తిక్,ఇంజమూరి పెద వీరబాబు,గురవయ్య,జయరాజు,బంగారిబాబు,రవి,మదు,చింటు,రాకేష్,సాయివర్మ,మహేష్,ప్రణిత్,యెడవెల్లి నాని,మచ్చ విజయ్,రెడ పంగు శ్రీరాములు,మచ్చ నాగయ్య,ఇంజమూరి కాటయ్,యెడవెల్లి వరుణ్,పాపట్ల నవీన్ తదితరులు ఉన్నారు
Post Views: 240