తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య దేశ సగటు కంటే తక్కువగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాల సగటు చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణేర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు మాతా శిశు సంక్షేమం కోసం పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి విధితమే.
అందులో భాగంగా కేసీఆర్ కిట్లు,సర్కారు దవఖానాల్లో కార్పోరేట్ తరహా వైద్య వసతులు కల్పన తదితర కారణాలతో రాష్ట్రంలో ఐరన్ లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గింది అని ప్రముఖ జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది.
పిల్లలు,తల్లుల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా అంగన్ వాడీల్లో కూడా గుడ్లు,పాలు,వివిధ పోషకాలుండే ఆహారపు పిండిని కూడా అందజేస్తుంది. ఐరన్ లోపంలో ఏ రాష్ట్రంలో ఎంత శాతముందో కింద ఉన్న జాబితాను చూసి తెలుసుకోవచ్చు..