టీమిండియా 601 పరుగుల వద్ద డిక్లేర్ ఇచ్చింది. ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచ్చుకున్న భారత్ ఆదిలోనే రోహిత్ ఔట్ అయినప్పటికీ ఓపెనర్ అగర్వాల్ సెంచరీ చేసాడు. ఇప్పుడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో 250మార్క్ ని చేరుకున్నాడు. తద్వారా తాను ఇంతకుముందు సాధించిన 242 పరుగుల వ్యక్తిగత స్కోర్ ను క్రాస్ చేసాడు. అంతేకాకుండా సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత స్కోర్ 248 రన్స్ ను దాటేసాడు. మునుమ్ముందు ఇంకెన్ని సాధిస్తాడు అనే విషయానికి వస్తే అతడికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. ఇప్పటికే ఈ డబుల్ సెంచరీ తో 7సార్లు ఈ ఫీట్ ని సాధించాడు. ఇక జడేజా 91 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.