“ఆడపిల్లను పుట్టనిద్దాం..బతకనిద్దాం..చదవనిద్దాం..ఎదగనిద్దాం”. ఆడపిల్ల దేశానికే గర్వకారణం. “స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. ఆడపిల్లను రక్షించుకుందాం సృష్టిని కాపాడుకుందాం”.
అప్పట్లో ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని భావించేవారు. ఈరోజుల్లో ఆడపిల్ల పుట్టడమే భారమని భావిస్తున్నారు. కడుపులోనే ఆడపిల్లను చంపేస్తున్నారు. ఒకవేళ పుట్టినా నిమిషాల్లో అమ్మేస్తున్నారు. అది కూడా కాదు అనుకుంటే ఏ చేత్తకుప్పల్లోనో, పొదల్లోనో వదిలేస్తున్నారు. అసలు ఏం పాపం చేసారని వారికి ఈ శిక్షా..?
ఇవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది బాలికలు ఎన్నో సమస్యలను, సవాళ్ళను ఎదురుకుంటున్నారు. ఈ సమస్యలను ప్రపంచానికి తెలియజేసేలా మరియు వారికి అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రతీ ఏడాది అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఈమేరకు డిసెంబర్ 19న 2011లో ప్రకటించడం జరిగింది.