మలేషియాకు భారత్ గట్టి షాకిచ్చింది. ఈ క్రమంలో కాశ్మీర్ అంశంలో మలేషియా ప్రధాని మహతిర్ మహ్మద్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఈ క్రమంలో మలేశియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్ నిలిపివేసే ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు సమాచారం. దీనికి ప్రత్యామ్నాయంగా ఇండోనేషియా,అర్జెంటీనా ,ఉక్రెయిన్ దేశాల నుంచి పామాయిల్ ను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. ఈ ఏడాది మలేశియ దేశం నుంచి పామాయిల్ అత్యధికంగా దిగుమతి చేసుకుంది. అందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.