వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున టీడీపీ ఆరోపణలు చేస్తోంది.. గ్రామ సచివాలయాలకు పార్టీ రంగులు ఎలా వేస్తారు అని ప్రశ్నిస్తుంది.. అసలు పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ కార్యాలయాలకు తేడా లేదు అని ఈ రెండింటిని ఎలా గుర్తించాలి అని చెప్పి ప్రశ్నిస్తోంది. సచివాలయం అన్నిటికీ వైఎస్ఆర్సిపీ రంగులు వేస్తుండడం పట్ల విమర్శలు గుపిస్తుంది. అయితే దీనికి వైసీపీ సరైన సమాధానం ఇస్తోంది. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టారని ఇందులో భాగంగా లక్షల కొద్ది ఉద్యోగాలు తీసి ప్రజలకు అందుబాటులో వారిని కూర్చో పెడుతున్నారని ప్రజలకు ఏ పని కావలసిన 72 గంటల సమయంలో ఇవ్వడానికి ప్రజారంజక పాలన చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు.
గత తెలుగుదేశం హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రేషన్ కార్డు కావాలన్నా ఏం కావాలన్నా ఆధార్ కార్డు కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని ఆరోగ్యశ్రీ కోసం అనేక సార్లు తిరిగే వారిని అయితే జగన్ పాలనలో అవన్నీ ఒకే చోట సదుపాయాలు అందుతున్న విషయం ప్రజల్లోకి బలంగా వెళ్ళేలా అందరికీ తెలిసేలా చూడగానే ఇది గ్రామ సచివాలయం అని గుర్తుపట్టేలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ రైతులకు విద్యార్థులకు అన్ని రకాల సేవలు ఒకే చోట అందిస్తున్నారని తెలియ చెప్పడానికి ఈ విధమైన రంగులు వేస్తున్నామని చెప్తున్నారు. టీడీపీ నేతల మాదిరిగా బడులకు, వాటర్ ట్యాన్ కులకు వేయటం లేదని, ఒకవేళ ఎవరైనా అలా వేస్తే ఆ రంగులు తొలగిస్తామని చెప్తున్నారు.