నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో మొదటి విడత ప్రచారం పూర్తి చేసుకున్న గులాబీ పార్టీకీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కే.టి రామారావు నిర్వహించిన రోడ్ షో లీడర్ లో క్యాడర్ లో గెలుపుపై విశ్వాసాన్ని పెంపొందించగా ….అదే విశ్వాసాన్ని మరింత పెంపొందించేందుకు గాను ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లా కు చెందిన ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ విపక్ష కాంగ్రెస్ ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ నియోజకవర్గాన్ని చుట్టి వస్తున్నారు.శాసనమండలిలో విప్ నియోజకవర్గ ఇంచార్జ్ పల్లా రాజజేశ్వర్ రెడ్డి ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తూ క్యాడర్ ను లీడర్ ను
ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.
ఈ క్రమంలో భాగంగానే శుక్రవారం ఉదయం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామం,కొనయిగూడెం,కుతుబ్ షా పురం తదితర గ్రామాలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు . ఒక ఓటు తల రాతలు మారుస్తుంది.2014 కు ముందు…తరువాత వేసిన ఓట్లే ఆ మార్పుకు సంకేతమన్నారు. ఆ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికాయన్నారు. 24 గంటలు ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత తోటే అది సాధ్యపడిందన్నారు. ఈ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ దే గెలుపన్నారు.