యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే తానూ తీస్తున్న చిత్రాలన్నీ విఫలమవ్వడమే దీనికి ముఖ్య కారణం. ఒక్కప్పుడు చిన్న స్టొరీలతో మంచి హిట్ లు అందుకున్న ఈ హీరోకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కుంటున్నాడు. దీనంతటికి కారణం ఏమిటీ అంటే అతను తమిళ దర్శకులను నమ్ముకోవడమే. అదే తన కెరీర్ ను కొంప ముంచింది. ఇక మొన్న వచ్చిన చాణుక్య చిత్రం విషయానికి వస్తే..ఈ చిత్రానికి కూడా తమిళ్ డైరెక్టర్ నే. ఈ చిత్రం స్టొరీ బాగునప్పటికీ టేకింగ్ అస్సలు బాలేదని చెప్పాలి. అంతే కాకుండా ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అంతకుముందు వచ్చిన ఆక్సిజన్ చిత్రానికి కూడా తమిళ్ డైరెక్టర్ నే. ఆ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఇకనైన గాడిలో పడతాడ లేదా అనేది వేచి చూడాలి.
