టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ లెగ్ స్పిన్నర్ ,మాజీ అటగాడు అనిల్ కుంబ్లే సరికొత్త అవతారమెత్తాడు. ఈ నేపథ్యంలో అనిల్ కుంబ్లే పంజాబ్ క్రికెట్ జట్టుకు కోచ్ గా మనముందుకు రానున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు ప్రధాన కోచ్ గా నియమితులయ్యాడు. అయితే ఇప్పటివరకు ప్రధాన కోచ్ గా ఉన్న మైక్ హెసన్ తో కాంట్రాక్ట్ ముగియడంతో పాటు ఆటగాళ్ల ప్రదర్శనలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆ జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కోచ్ గా అనిల్ కుంబ్లే సూచనలు,సలహాలను తీసుకుని ఇతర సిబ్బందిని నియమిస్తామని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది.
