ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూనియర్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా మరో ముందడుగు వేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ జూనియర్ అడ్వకేట్ లకు ప్రతినెలా ఐదు వేల రూపాయల ఇస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అప్పట్లోనే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. అయితే ఈ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలని జగన్ భావించారు.వచ్చే నెల 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో జూనియర్ లాయర్లుకు ఐదువేల రూపాయలు ఇవ్వాలని దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేశారు.
కొత్తగా పూర్తి చేసిన యువకులు వృత్తిలో పొందేవరకు మూడేళ్లపాటు ఐదు వేలు ఆర్థిక సాయం ఇస్తామన్నారు. దీనికి సంబంధించి గ్రామ వార్డు వాలంటీర్లు తనిఖీలు చేసి గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో ఆ వివరాలను ఎంపీడీవోలకు పంపుతారు. అవి పరిశీలించి జిల్లా కలెక్టర్ కు పంపిన తర్వాత అర్హులైన వారికి ఐదు వేల రూపాయల స్టేఫండ్ ఇస్తారు. దరఖాస్తుదారుడు లా గ్రాండ్ చేసింది పొంది ఉండాలి. అతని పేరు బార్ కౌన్సిల్ సెక్షన్లో నమోదయి ఉండాలి అంతేకాకుండా కొత్తగా పూర్తిచేసి ఉండాలి. జూనియర్ ప్రాక్టీసు ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు ఇస్తారు. ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులు లేదా బార్ కౌన్సిల్ అసోసియేషన్ నుంచి ధ్రువీకరణ పత్రం తెచ్చుకోవాలి. కుటుంబంలో ఇద్దరు ఉంటే ఒకరికి మాత్రమే ఇస్తారు. ఆధార్ కార్డు కలిగి ఉండి దరఖాస్తుతోపాటు ఫోన్ నెంబరు పొందుపరచాలి. ముఖ్యంగా దరఖాస్తుదారుడు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు.