పోలీసులు.. మీ సంగతి చూస్తాను, భవిష్యత్తులో మీరు బాధపడతారు అంటూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసులు హెచ్చరించారు. పోలీసులు కావాలంటే వైఎస్ఆర్సిపిలో చేరవచ్చని హెచ్చరించారు.. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో వైజాగ్ వచ్చిన చంద్రబాబు పోలీసులు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి.. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో రెండురోజుల సమావేశానికి వచ్చిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన తనకు ప్రతి ఒక్కరి జాతకాలు తెలుసన్నారు. తమాషాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి జగన్ పైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నేరస్తులు పరిపాలిస్తున్నారు, దుర్మార్గమైన ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. టీడీపీ కార్యకర్తలు జగన్ పై పోరాడితే జగన్ ఖచ్చితంగా పులివెందుల పారిపోతారు ఎద్దేవా చేశారు.