విశాఖ జిల్లా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి త్వరలో ఓ ఇంటి కోడలు కాబోతుంది. తన చిన్నాటి స్నేహితుడు శివప్రసాద్ ను ఈ నెల 17న మాధవి పెళ్లి చేసుకోబోతుంది. అతి చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 25 ఏండ్లకే ఎంపీగా గెలిచారు. ఎన్నికల సమయంలో అన్నీ తానై చూసుకున్న శివప్రసాద్ ఇక జీవితాంతం తనతోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 17న వీరిద్దరు ఒక్కటి కానున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరు నిండు నూరేళ్లు పిల్లాపాపలతో ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తున్నారు.
