తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ గారి భౌతికకాయాన్ని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యోగసంఘాల నాయకులతో కలిసి సందర్శించి నివాళులు అర్పించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి దశ, మలి దశ ఉద్యమం లో K R అమోస్ గారి పాత్ర ఎంతో ఉందన్నారు. K R అమోస్ గారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి ని చూసారు. ఎంతో ఆనంద పడ్డారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. K R అమోస్ గారు భౌతికంగా దూరమైన వారి ఆశయాలను కొనసాగిస్తామన్నారు.
అమోస్ గారి కుటుంబానికి ఉద్యోగుల, ప్రభుత్వం తరపున తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. K R అమోస్ గారి భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో రాష్ట్ర TNGO అధ్యక్షులు కారం రవీందర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు, రాష్ట్ర బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్, TGO నాయకులు కృష్ణ యాదవ్ మరియు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Post Views: 321