అతనో సూపర్ స్టార్ . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యధికంగా రెమ్యూనేషన్ తీసుకునే అగ్ర హీరో. అయితేనేమి తాను రీల్ హీరోనే కాదు రీయల్ హీరోనంటూ నిరూపిస్తున్నాడు. అతడే టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. పాత శ్రీకాకుళలో టెక్కలి ప్రాంతానికి చెందిన పదమూడు నెలల చిన్నారి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం సూపర్ స్టార్ మహేష్ బాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆ చిన్నారి ఆపరేషన్ కు అవసరమైన మొత్తాన్ని తానే చెల్లిస్తానని ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చాడు. టెక్కలి ప్రాంతానికి చెందిన సందీప్ అనే పదమూడు నెలల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఆ చిన్నారి గుండెలో మూడు హోల్స్ ఉన్నాయి. శస్త్ర చికిత్స అవసరమని. చాలా త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఆర్థికంగా వెనకబడిన ఆ చిన్నారి తల్లిదండ్రులు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో జిల్లా మహేష్ బాబు సేవాసమితి అధ్యక్షులు ఉంకిలి శ్రీనివాస్ రావు దగ్గరకెళ్ళారు. దీంతో ఉంకిలి మహేష్ బాబుకు సమాచారమందించడంతో ఏపీలోని విజయవాడ ఆంధ్రా ఆసుఒఅత్రిలో సందీప్ కు శస్త్ర చికిత్స చేయించడానికి మహేష్ బాబు ముందుకొచ్చారు. దీంతో ఆ చిన్నారి తల్లి దండ్రులు మహేష్ సాయాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్నారు.
