ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో సంచలనానికి ముందడుగు వేసాడు. మరో హామీను అమ్మల్లో పెట్టడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు. ఈ మేరకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుకు సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ఆ హామీ ఏంటి అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల గురించి. ఇప్పటిదాకా ఈ ఉద్యోగాలకు సంభదించి అంతగా పట్టించుకునే నాధుడే లేడు. రకరకాల ఏజెన్సీల ద్వారా వచ్చి ఇందులో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఉన్నారు. ఇలా చేయడం వల్ల అందరికీ ఉద్యోగాలు దక్కడంలేదు. దాంతో జగన్ చెప్పిన ఈ గుడ్ న్యూస్ కి వారిలో సంతోషం మొదలైంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాకుండా వీరిలో 50% ఆడవారికి రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు. ఈ మేరకు కార్పోరేషన్ ఏర్పాటుచేసి త్వరలోనే ఇది అమలు చేయనున్నారు. గత ప్రభుత్వంలో వీరిని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎక్కడ చూసినా ఉద్యోగాల పేరుతో డబ్బు నోల్లెసారు తప్ప ఎవరికీ సరైన న్యాయం చెయ్యలేదు.
