రానా దగ్గుబాటి..బాహుబలి చిత్రంతో ఒక్కసారిగా తన క్రేజ్ ఆకాశానికి తాకింది. తన బాడీ చూస్తే ఎవరికైనా సరే వారెవా అనిపించేలా ఉంటాది. అంతటి బలవంతుడికి ఏమైంది, ఎక్కడున్నాడు అనేదే ప్రస్తుత ప్రశ్న.. అయితే తాను కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్ళాడు..అందరు షూటింగ్ కోసం వేల్లాడనే అనుకున్నారు. ఎంతకీ రానప్పటికీ ఏమైందో అని అనుకున్నారు. ఎదో ఆరోగ్య సమస్యతో వెళ్ళాడు అని ఎవరికివారు అనుకున్నారు. కాని తాను రీసెంట్ గా పెట్టిన ఒక ఫోటో తో వారు అనుకున్నదే నిజం అయ్యింది.ఆయన అమెరికాలో కిడ్నీ సంబంధిత చికిత్స తీసుకుంటున్నాడు. ఈ కారణంగానే ఆయన సినిమాలకు కూడా దూరంగా ఉన్నాడని, ఈ మేరకు కొన్ని షూటింగ్ కూడా ఆగిపోయాయని తెలిసిందే. అయితే ప్రస్తుతం ట్రీట్మెంట్ పూర్తిచేసుకున్నపటికీ తనకి మూడు నెలలు రెస్ట్ కావలి. అల అయితే తననే నమ్ముకొని సినిమాలు ఒప్పుకున్న వారి పరిస్థితి ఏమిటో అనేదే ఇప్పుడు అందరి ప్రశ్న..?
