సినిమా హీరోయిన్స్ కి నిజానికి తెగ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ల అందానికి మాటలకి కుర్రాళ్లు పిచ్చి వాళ్లు అయిపోతుంటారు. నిజానికి హీరోయిన్ అయిన ఏ అమ్మాయికి అయినా ప్రపోజల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అదేంటి రకుల్ ని పట్టించుకునే వారే లేరని తెగ బాధపడుతుంది.
తాజాగా మంచు లక్ష్మి ఫీట్ విత్ స్టార్ అంటూ వెబ్ పొగ్రాం స్టార్ట్ చేసింది లక్ష్మి. ఈ పొగ్రాంలో అన్ని విషయాలు మాట్లాడుతా అంటూ షో మొదలు పెట్టారు. అయితే ఈ సందర్బంగా అబ్బాయిల గురించి మాట్లాడిన రకుల్ తనకు ఇంకా బాయ్ ఫ్రెండ్ దొరకలేదని చెప్పుకొచ్చింది. సరైన మగాళ్లు మార్కెట్ లో లేరని క్వాలిటీ పడిపోయిందని చెప్పుకొచ్చింది. ఎక్కడైన ఫారన్ కంట్రీస్ కి వెళితే మంచు లక్ష్మీ చుట్టు అబ్బాయిలు చేరుతున్నారు కానీ..తనని అస్సలు పట్టించుకోవటం లేదని చెప్పుకొచ్చింది. దీంతో లక్ష్మి అబ్బాయిలు కాస్త రకుల్ ని కూడా పట్టించుకోండి అంటూ సెటైర్ వేసింది.