భారత వాయుసేనలోకి రఫేల్ యుద్ధవిమానం చేరింది. క్రేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దీనిని ఫ్రాన్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో స్వీకరించారు. దీని రాకతో భారత వాయుసేన మరింత బలంగా తయారయ్యిందని చెప్పొచ్చు. ఇక 2022 నాటికి మొత్తం 36 విమానాలు భారత్ కు రానున్నాయి. ఇక ప్రస్తుతం ఈ విమానాలు ఎందుకు తీసుకుంటున్నారు అనే విషయానికి వస్తే…భారత్ కు ప్రస్తుతం ఉన్న వాటిలో కొన్ని చాలా పాతవి అయ్యిపోయాయి. అటు చైనా, పాకిస్తాన్ దగ్గర మాత్రం అదునాతన విమానాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో రక్షణ నిపుణుల సలహా మేరకు వాటిని కొనుగోలు చేస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగానే ఫ్రాన్స్ తో ఒప్పందం పెట్టుకున్నారు.
ఇక దీనియొక్క ప్రత్యేకతలు విషయానికి వస్తే…!
* రఫేల్ యుద్ధవిమానానికి రెండు ఇంజిన్లు ఉంటాయి. దాడుల విషయంలో వీటికి తిరిగుండదు.
*ఎన్ని రకాల ఆయుదాలైన ఇందులో ఉంచవోచ్చు. అంతేకాకుండా టార్గెట్ చేసి దాడి చేయడం దీని ప్రత్యేకత.
* దీనికి ఆక్సిజన్ జనరేషన్ సౌకర్యం ఉంది.
* ఎలాంటి భయంకరమైన దాడులనైనా తట్టుకోగల శక్తి దీనికి ఉంది.
* ఇవి సముద్రమట్టానికి ఎత్తుగా ఉండే స్థావరాలపై కూడా వాడొచ్చు.
* ముఖ్యంగా ఇది రాడార్లను గుర్తిస్తుంది.
మొత్తంగా చెప్పాలంటే రఫేల్ రాకతో భారత్ కు గట్టి బలం తోడయిందని చెప్పాలి.