త్వరలో మహారాష్ట్ర, హరియాణాలో జరగనున్న ఎన్నికలు సందర్భంగా ప్రచారాలు జోరందుకున్నాయి. ముఖ్య నేతలందరూ తమ పార్టీ తరుపున ప్రచారాల్లో పాల్గొంటున్నారు.ఇక ఈ ఎన్నికలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రచారానికి సర్వం సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 14 నుండి 19 వరకు ఈ రెండు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ర్యాలీల్లో ఆయన పాల్గొనున్నారు. మూడు రోజులు మహారాష్ట్రలో, మిగతాది హర్యానాలో జరిగే ఎన్నికల ప్రచారానికి ఆయన హాజరవుతారు. ఈ రెండు రాష్ట్రాల్లో 19న ప్రచారాలు ముగియనున్నాయి, అనంతరం 21న ఎన్నికలు, 24న ఫలితాలు విడుదల కానున్నాయి.