ప్రస్తుతం వైసీపీలో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలో పార్టీని వీడిన మాజీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చేసరికి ఒక్కొక్కరుగా వచ్చి జగన్ పంచన చేరుతున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైస్థాయి నాయకులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా, పైకి నవ్వుతు ఉన్నా ద్వితీయ శ్రేణి, అదేవిధంగా సోషల్ మీడియా కార్యకర్తలు మాత్రం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా జూపూడి ప్రభాకర్ వంటి నేతలు పార్టీలో చేరడం చాలా మంది సహించలేకపోతున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితో రాజకీయ అరంగేట్రం చేసిన చాలామంది నాయకులు అనంతరం జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నాయకులుగా ఎదిగారు. అయితే అనేక ఒడిదుడుకుల అనంతరం 2014లో వైసీపీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడగా ఇదే అదునుగా చేసుకుని కొందరు నాయకులు టీడీపీలో చేరడం మల్లా ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో వీరంతా వైసీపీ లోకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
దీనిని సహించుకోలేని పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు. అయితే వీరంతా ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. ఒక పొలిటికల్ పార్టీ నడవాలంటే అడ్మినిస్ట్రేషన్ చాలా అవసరం. ఈ క్రమంలో సీనియర్ నాయకులను చేర్చుకునేందుకు పార్టీ అధిష్టానం అదే సమయంలో వారికి ఎటువంటి పదవులు ఇవ్వబోమని స్పష్టంగా చెబుతుంది. ఇదే క్రమంలో గతంలో పార్టీ కోసం పని చేశారు. పార్టీని నిలబెట్టిన సాఫ్ట్ కార్నర్ కూడా వీరిపై పని చేస్తుంది. అదే విధంగా వైసీపీ పెంచుకోవాలంటే మరింత బలోపేతం కావాలంటే తెలుగుదేశం పార్టీ బలహీన పడిందని ఈ క్రమంలో ఆ పార్టీ నుంచి వచ్చే చోటామోటా నాయకులతోపాటు పెద్ద నేతల వస్తే ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో టీడీపీ బలహీన పడుతుందని అందుకే ఆహ్వానించాలని మరి కొందరు చెబుతున్నారు.