ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నాలుగు బాషల్లో విడుదలైన చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా హీరో రామ్ చరణ్ చిత్రాన్ని నిర్మించాడు. రిలీజ్ అయిన మొదటిరోజు నుండే కలెక్షన్ల వెల్లువ మొదలైంది. చిరంజీవి తన నటనతో విశ్వరూపం చూపించాడు. అయితే ఈ చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది అనే విషయానికి వస్తే సినిమా రికార్డులు బ్రేక్ చేసిందని, సూపర్ అని అంటున్నారు. అంతేకాకుండా ఈ చిత్రం చూసిన ప్రతీఒక్కరికి నిజజీవితంలో చాలా నేర్చుకోవాలని, దానికి సంభందించి కొన్ని సన్నీ సన్నివేశాలు డైరెక్టర్ సురేందర్ రెడ్డి చక్కగా చిత్రీకరించారని అన్నారు. అవేమిటంటే..!
*ఒక అమ్మాయి ఎలా ఉండాలో ఈ చిత్రంలో తమన్నా ని చూసి నేర్చుకోవాలి.
*నిజమైన స్నేహితుడు ఎలా ఉండాలో సుదీప్ చూపించాడు.
*మనకి కావాల్సిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారని ఇందులో సురేందర్ రెడ్డి బాగా చూపించాడు.
*ఏ రక్త సంభంధం లేకపోయినా కేవలం అభిమానం కోసం ప్రాణాలు ఇస్తారు అని విజయ్ సేతుపతి చూపించాడు.
*మన సంపద ఇంకొకడు దౌర్జన్యంగా తీసుకెళ్తుంటే..ఎదురించడానికి వయసు కాదు ధైర్యం ఉండాలని చిన్నపిల్లలకు చూపించాడు.
*ఒక ఆడపిల్ల మానం కాపాడడం కన్నా మాకు మా సంపద గొప్పది కాదని, ఇందులో ప్రజల్ని చూసి నేర్చుకోవచ్చు.
*ఒకరికింద బానిస బతుకు బ్రతకడం కన్నా స్వేఛ్చ కోసం తల తెగపడిన చివరి రక్తపు చుక్క వరకు పోరాడాలి అని నరసింహ రెడ్డిని చూసి నేర్చుకోవాలి.
ఇలా ప్రతీ సన్నివేశం మంచిగా ఒక అర్ధం వచ్చేటట్టు డైరెక్టర్ బాగా చూపించడంతో అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.