మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రోజురోజికి మరీ దారుణంగా తయారవుతుంది. సొంత పార్టీ నాయకులే బాబుకు చుక్కలు చూపిస్తున్నారట. బాబు ఇటు అధికార పార్టీ పై బురద జల్లడం, అటు తన పార్టీ నాయకులను బుజ్జగించడం అతడికి తలనొప్పిగా మారాయట. ఇక ప్రస్తుతం బాబుకి మరో జలక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తన సొంత గూటికి వెళ్ళిపోయాడు. జగన్ సమక్షంలో వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఆయనను జగన్ కండువా కప్పి ఆలింగనం చేసుకొని మరీ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు జగన్ పార్టీ పెట్టినప్పుడు వైసీపీలోనే ఉన్న జూపూడి ఆ తరువాత టీడీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జూపూడి టీడీపీలో చేరి పొరపాటు చేసానని.. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకుంటానని అన్నారు. వీరితోపాటు ఆకుల సత్యనారాయణ కూడా తన అనుచరులతో పార్టీలో చేరారు. జగన్ అమలు చేస్తున్న పధకాలు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారని జూపూడి అన్నారు.