2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాటు ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజా విశ్వాసం కోల్పోయింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పోరాటాలతో జగన్మోహన్రెడ్డి నిత్యం ప్రజల్లో ఉండటంతోపాటు పాదయాత్రతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ గెలవడానికి టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు మాత్రం సోషల్ మీడియా నే.. అయితే వైయస్సార్సీపి కోసం గతంలో పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు పనిచేశారు. సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రతిపక్ష వైఎస్ఆర్సిపీ ఆవశ్యకతను నవరత్నాల ప్రభావాన్ని జగన్మోహన్రెడ్డి నిర్ణయాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ప్రభావం గట్టిగా పని చేసింది.
అయితే 2019లో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైన తరువాత కారణాలు విశ్లేషించుకుని టీడీపీ సోషల్ మీడియాలో కూడా తమకు మద్దతు లేదనే విషయాన్ని గ్రహించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వేదికగా ఎన్.బి.కె కార్యాలయంలో దాదాపుగా రెండు వేల మందితో వైఎస్ఆర్సిపీ పై దుష్ప్రచారం చేసేందుకు వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జగన్ పాలనా విధానాలను వ్యతిరేకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలు రూపొందించారు. ఈ అంశాలు కృష్ణాజిల్లా ఎమ్మెల్యే జోగి రమేష్, గుంటూరు జిల్లా ఎమ్మెల్యే శ్రీ దేవి తదితరులు పోలీసులకు అప్పగించారు. ఎంతైనా చంద్రబాబు కదా హైటెక్ తెలివితేటలతో ప్రజలను మభ్యపెట్టాలని చూసి చివరికిలా సాక్ష్యాధారాలతో సహా బుక్కయ్యారు.