విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు తొలిసారిగా చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడివరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల అమ్మవారి పీఠపూజ, అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి రోజు స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుంటున్నారు. ఈ రోజు ఉదయం కెప్టెన్ ఇంట్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సతీసమేతంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారు నన్నపునేని నరేందర్‌కు శుభాశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, స్వామివారి ధర్మ ప్రచారయాత్ర కన్వీనర్, దరువు ఎండీ సీహోచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కెప్టెన్ ఇంట్లో దర్శనం తర్వాత ఎమ్మెల్యే శ్రీ నన్నపునేని నరేందర్ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారితో కలిసి…భద్రకాళీ అమ్మవారి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
