నవరాత్రుల్లో భాగంగా 9వ రోజైన సోమవారం అనగా ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు విజయవాడలో కొలువుతీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ మహిషాసురమర్థినీ దేవిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఎనిమిది చేతులతో మహిషాసురుడిని సంహరించింది. నవదుర్గల్లో ఇదే అత్యుగ్రరూపం. అమ్మవారు ఈరోజు లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిస్టించి భక్తులకు మహాశక్తిగా దర్శనమిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున తల్లికి గారెలు, బెల్లంతో కలిపినా అన్న పెడతారు.
