టీమిండియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ మహ్మాద్ షమీ తన ప్రతాపం చూపిస్తూ రెండో ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను పడగొట్టాడు. అంతే కాదు ఈ ఐదు వికెట్లలో నాలుగు బౌల్డ్ తో రావడం గమనార్హం.
షమీ ఇంతగా రాణించడం వెనుక ఒక పెద్ద సీక్రెట్ ఉందని చెప్పుకోచ్చాడు టీమిండియా డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ మ్యాచ్ కు ముందు షమీ బిర్యానీ తినడమే ప్రధాన కారణం .
అందుకే అంత చక్కగా రాణించాడు. షమీ బిర్యానీ తిన్నాక చాలా ఉత్సాహాంగా .. శక్తివంతంగా ఉంటాడు. దాంతో అతనిలోని అత్యుత్తమ ప్రతిభ బయటకు వస్తుంది అని నవ్వుతూ చెప్పాడు రోహిత్.