తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో సగం బస్సులు అద్దె బస్సులే అని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ సిబ్బంది సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటనను ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా మీడియాకు విడుదల చేశారు.
ఆ ప్రకటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ”తెలంగాణ ఆర్టీసీలో భవిష్యత్ లో నడుపబోయే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులుంటాయి. మిగతా సగం ఆర్టీసీ యాజమాన్యానివి ఉండాలని నిర్ణయం జరిగింది. ఈ పద్ధతిలో చర్యలు చేపడితే బస్సులు బాగా నడుస్తాయి.
రెండుమూడేండ్లలోనే సంస్థ నష్టాలను పూడ్చుకొని లాభాల్లోకి వస్తుంది. మొత్తం పదిహేనురోజుల్లో ఆర్టీసీ పూర్వస్థితికి రావాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ లాభాలకై పలు కీలక చర్యలు తీసుకుంటాం. అందుకు అవసరమైన చర్యలను కూడా తీసుకుంటాం. ఇక ముందు ఆర్టీసీలో యూనియన్లు,జాక్ లు ఉండవు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చి చెప్పారు.