టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఓ విషయంలో తొందరపాటు పడడమే ఆయన కొంప ముంచిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి నాగార్జున సినిమాలు చూస్తే గత పది సంవత్సరాలుగా ప్రతి సినిమా డిసెంబర్ నెలలో విడుదల అవుతుంది. కానీ ఇటీవల విడుదలైన చిత్రం మాత్రం దానికి భిన్నంగా మూడు నెలల ముందే రిలీజ్ చేశారు. నాగార్జున కూడా చాలా ఇంటర్వ్యూలో తనకు డిసెంబర్ నెల బాగా కలిసి వస్తుందని చెప్పుకొచ్చారు. ఆడియో ఫంక్షన్లో కూడా డిసెంబర్ నెల అంటే తనకు ఇష్టమని అందుకే ప్రతి సినిమా డిసెంబర్లో విడుదల చేస్తుంటారు అని చెప్పారు. అయితే ఇన్ని తెలిసిన కూడా నాగార్జున మన్మధుడు2 సినిమా విషయంలో తొందర పాటు పనిచేశారు. కొన్ని రోజుల పాటు సినిమాపై కూర్చుంటే ఎడిటింగ్ విషయంలో కొన్ని షార్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా కచ్చితంగా హిట్ అయ్యేది. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని నిబంధన పెట్టుకోకుండా రిలీజ్ చేయడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సరిగ్గా చేయకపోవడం వల్ల నాగార్జున సినిమా ఇలా అయ్యిందని ఫిలిమ్ వర్గాలు చెబుతున్నాయి.