ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక వారితో ఎలాంటి చర్చలూ జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
సమ్మెపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి ముగిసింది. చట్టవిరుద్ధమైన సమ్మెకు, అదీ పండుగల సమయంలో సమ్మెకు దిగిన వారితో ఎలాంటి రాజీ సమస్యే లేదని, వారు చేసింది తీవ్రమైన తప్పిదమని మండిపడ్డారు.గడువు లోపు, అంటే ప్రభుత్వం విధించిన గడువు లోపల విధుల్లోకి హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది లోపే సిబ్బంది అని సీఎం ప్రకటించారు.
తక్షణ చర్యగా 2500 బస్సులను అద్దె పద్ధతిలో తీసుకొని నడపాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ మనుగడ సాగించాలంటే కొన్ని చర్యలు తప్పవనీ, భవిష్యత్తులో ఆర్టీసీకి సంబంధించి, క్రమశిక్షణారాహిత్యం, బ్లాక్మెయిల్ విధానం శాశ్వతంగా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Post Views: 303