తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది ,ఆయా యూనియన్ల బ్లాక్ మెయిళ్లకు భయపడం. తల వంచే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు.సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది తీరుపై ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా సీరియస్ గా ఉన్న సంగతి విదితమే.
నిన్న ఆదివారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా సమ్మెలో పాల్గొనని పన్నెండు వందల సిబ్బందిని తప్పా మిగతావారిని ఎవర్నీ తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి పండుగ పూట సమ్మెకు దిగడం చాలా బాధాకరం.. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోకుండా సమ్మెకు దిగడం మంచిది కాదు. ఆర్టీసీను ప్రభుత్వంలో విలీనం చేయబోము. ఇక భవిష్యత్ లో ఆర్టీసీ ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంతో నడుస్తుంది. ఆర్టీసీ బంగారు భవిష్యత్ కోసం పలు కీలక చర్యలు చేపడతామని కూడా ముఖ్యమంత్రి చెప్పినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.