2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి పదేళ్లుగా పడిన కష్టానికి పట్టాభిషేకం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు ఎంతో మంది నాయకుల శ్రమతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జగన్ ప్రజల పక్షాన తండ్రి మాదిరిగా పాలనలో ముందుకెళుతున్నారు. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలతో పేదల కోసం నిత్యం ఆలోచిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. తాజాగా ప్రవేశపెట్టిన గ్రామ సెక్రటేరియట్ విషయంలో పార్టీ రంగులు వేయడం పట్ల కొందరు అభ్యంతరాలు తెలిపారు.
అయితే గ్రామ సెక్రటరీ వ్యవస్థ కాబట్టి ప్రజలు ఎవరైనా తెలియని వారు చూస్తే గుర్తు పట్టే విధంగా అన్ని సదుపాయాలు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కాబట్టి పెద్దగా ఎవరూ వ్యతిరేకించలేదు. అయితే లీడర్లు మాత్రం కాస్త ప్రదర్శిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్కూల్స్, మంచి నీటి బోరు ఇలా ఏ వస్తువు కనిపిస్తే దానికి మరియు ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు కూడా పార్టీ రంగు పోయడం పెద్దగా ఎవరికీ నచ్చడం లేదు. ఈ క్రమంలో కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ హయాంలో వాటర్ ట్యాంకులకు స్కూళ్లకు ప్రహరీ గోడలకు ఇష్టానుసారంగా పసుపు రంగు వేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కోరుతున్నారు. అహర్నిశలు శ్రమిస్తున్న జగన్కు చెడ్డ పేరు తీసుకు రావద్దని సోషల్ మీడియా వేదికగా సలహా ఇస్తున్నారు.