టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత చేసిన రెండో సినిమా సైరా నరసింహారెడ్డి. ఖైదీ నెంబర్ 150లో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ఆ సినిమా హిట్ అవడం తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనుకున్నదే తడవుగా చేయడం అది హిట్ అవ్వడంతో చిరంజీవి చేస్తున్న మూడో సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే చిరంజీవి కొరటాల శివ రాసిన సామాజిక స్పృహతో కూడిన సినిమా చేస్తారా లేదా బోయపాటి, పూరి జగన్నాథ్ లకు ఒక మంచి స్టైలిష్ కి వస్తారా అనేది మొదటి నుంచి ప్రశ్నగానే ఉంది. అయితే సక్సెస్ మీట్లో మాట్లాడిన చిరంజీవి ఈ ప్రశ్నకు సమాధానం దాటవేశారు. నిర్మాత ఎవరు,ఎవరితో చేస్తున్నారు అన్ని విషయాల్లో నాకు ప్రేక్షకులు అంటే చాలా ఇష్టం ఏ సమాచారం తెలిసిన వారితోనే పంచుకుంటాను కొద్దిగా సమయం ఇవ్వాలని చిరంజీవి కోరారు. అయితే ఎక్కువమంది మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో సోషల్ ఎలిమెంట్స్ వున్న సినిమా లో చిరంజీవి కనిపిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.