1996 నవంబర్ 4…తూర్పుగోదావరి జిల్లా వాసులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు అది. ఎందుకంటే ఆ రోజువరకు ఎవరికీ తుఫాన్ అంటే అంతగా పరిచయం లేదు. అప్పుడే బంగాళాఖాతంలో చిన్న తుఫాన్ పుట్టిందట. ఉరుములు లేవు, మెరుపులు లేవు ఈ తూఫాన్ రాత్రికి రాత్రే కాకినాడను చుట్టుముట్టేసింది. రికార్డు స్థాయి వేగంలో ఈదురుగాలులు వీచాయి. వేలాదిమంది జాలర్లు గల్లంతయ్యారు.కొంతమంది మరణించారు. ఇక కొన్ని లక్షల ఇండ్లు ద్వంసం అయ్యాయి. కాకినాడ పరిసర ప్రాంతాలు మొత్తం సర్వనాశనం అయ్యాయి. దాంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మూగబోయింది. కాని ప్రస్తుత రోజుల్లో ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ ప్రాంతం వారికి భయమే లేదు. కాకినాడ తీరం తాకినా దిగులు చెందాల్సిన అవసరం లేదు. దీనంతటికి ముఖ్య కారణం మడ అడవులు. సముద్రానికి సమీపంలో వాటి దాటిని తట్టుకునే వాటిని మడ అడవులు అంటారు. ఈ మొక్కలు ఉప్పు నీటిని తట్టుకుంటాయి. నీట మునిగినా ఎటువంటి హాని ఉండదు. ఈ మడ అడవులు వల్ల ఏ తుఫాను ముందుకు రాదు.ఈ కోరంగి అభయారణ్యంలో వేల రకాల మొక్కలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం దీని విస్తీర్ణత పెంచే యుచనలో ఉంది. దీనివల్లనే ఆ ప్రాతం తుఫాను దాటిని తట్టుకుంటుంది. దీనివల్ల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.ఇక్కడ సముద్ర తీరం వెంబడి 33 వేల హెక్టార్లు, కృష్ణా, గుంటూరు తీర ప్రాంతాల్లో 25 వేల హెక్టార్లలో మడ అడవులు ఉన్నాయి.
