తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సిబ్బంది సమ్మెపై స్పందిస్తూ”తనకు అన్నింటికన్నా అత్యంత ప్రాధాన్య అంశం తెలంగాణ గొప్ప రాష్ట్రంగా తయారుకావడమేనని తేల్చి చెప్పారు. సమ్మెపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ గురించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనను మీడియాకు విడుదల చేసింది.
ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మెపై స్పందిస్తూ” యావన్మంది ప్రజల క్షేమమే నా ధ్యేయం. ఒక అద్భుతమైన, గొప్ప, సమర్థమైన, లాభాలబాటలో నడిచే సంస్థగా ఆర్ట్టీసీ రూపుదిద్దుకోవాలి. హైదరాబాద్ నగరానికి చెందినంతవరకు నష్టాలను ప్రభుత్వం భరిస్తుంది. ప్రస్తుతం 10,400 బస్సుల్లో సుమారు కోటిమంది ప్రయాణం చేస్తున్నారు.
భవిష్యత్‌లో కూడా ఆ సౌకర్యం కొనసాగుతుంది. ఆర్టీసీ సిబ్బందికి సగటున నెలకు రు.50వేల జీతం వస్తున్నా, ఇంకా పెంచాలని అడగటంలో అర్థంలేదు. ఈ యూనియన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం తలవంచదు అని తేల్చిచెప్పినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.