పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యంత వివాదాస్పద ఎమ్మెల్యే గా పేరుగాంచిన చింతమనేని ప్రభాకర్ కు ఎట్టకేలకు జిల్లా కోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. గత 2014 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. టీడీపీ అండతో ఇష్టానుసారంగా చెలరేగిపోయారు. చంద్రబాబు ప్రోద్బలంతో చెలరేగిపోయారు. ఈ క్రమంలో చింతమనేని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక అక్రమ రవాణా చేయడం, అడ్డొచ్చిన అధికారులు కొట్టడం, సివిల్ పోలీసులు పై దాడులు, దౌర్జన్యాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు కొల్లేరు పరిసర ప్రాంతాల్లో దౌర్జన్యాలు ఇటు వంటి కార్యక్రమాలతో చెలరేగిపోయిన చింతమనేని దళితులను అనేకసార్లు దూషించారు. ఇటీవల చింతమనేని పాపం పండడంతో ఆయను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రిమాండ్ కు తరలిస్తున్న సమయంలో కోర్టు ఆవరణ వద్ద చింతమనేని మరోసారి ఈ పోలీసులపైనే దుర్భాషలాడుతూ రెచ్చిపోయాడు. అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అనేది చింతమనేని వ్యవహారంతో రౌడీ ఇజంతో ప్రవర్తించే ఎమ్మెల్యేలంతా జాగ్రత్త పడుతున్నారు.