సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి గాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయశాంతి, సంగీత, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, బండ్ల గణేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మహేష్ కు చిత్రానికి మరోసారి డీఎస్పీ సంగీతం అందిస్తున్నాడు. రామ్ సుంకర, మహేష్, దిల్ రాజు స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ నిన్న తన ట్వీట్ ద్వారా మహేష్ అభిమానులకు దసరా గిఫ్ట్ గా ఈరోజు 5 గంటలకు పోస్టర్ రిలీజ్ చేస్తానని చెప్పడంతో ఫాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూసారు. అయితే డైరెక్టర్ ఇచ్చిన టైమ్ పోస్టర్ వచ్చేసింది. అందులో మహేష్ కొండారెడ్డి బురుజు దగ్గర..ఆర్మీ ఫాంట్ తో గొడ్డలి పట్టుకొని ఉన్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. దీంతో సినిమా పై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
